Richest 100: భారత టాప్-100 శ్రీమంతుల జాబితాలోని ఆరుగురు మహిళలు వీరే!

  • తొలి స్థానంలో సావిత్రి జిందాల్
  • సావిత్రి జిందాల్ సంపద విలువ రూ. 13.46 లక్షల కోట్లు
  • రెండో స్థానంలో హావెల్స్ ఇండియాకు చెందిన వినోద్ రాయ్ గుప్తా
6 women are in top 100 richest Indian list

భారతీయ శ్రీమంతుల టాప్ 100 ఫోర్బ్స్ జాబితాలో ఆరుగురు మహిళలు స్థానం దక్కించుకున్నారు. ఈ ఆరుగురిలో ఓపీ జిందాల్ గ్రూపుకు చెందిన సావిత్రి జిందాల్ తొలి స్థానంలో నిలిచారు. ఆమె సంపదను రూ. 13.46 లక్షల కోట్లుగా అంచనా వేశారు. గత ఏడాది ఆమె సంపద విలువ రూ. 9.72 లక్షల కోట్లు. మొత్తం జాబితా విషయానికి వస్తే 71 ఏళ్ల సావిత్రి జిందాల్ ఏడవ స్థానంలో నిలిచారు. రెండో సంపన్న మహిళగా వినోద్ రాయ్ గుప్తా నిలిచారు. హావెల్స్ ఇండియా సంస్థకు చెందిన ఆమె వయసు 76 ఏళ్లు. రూ. 5.68 లక్షల కోట్లతో ఆమె మొత్తం జాబితాలో 24వ స్థానంలో నిలిచారు.

మూడో స్థానంలో యూఎస్వీ ప్రైవేట్ లిమిటెడ్ (ఫార్మా, బయోటెక్నాలజీ)కు చెందిన నీలా తివారీ (43) ఉన్నారు. టాప్ 100 జాబితాలో ఆమె 43వ ర్యాంకు సాధించారు. ఆమె సంపద విలువ దాదాపు రూ. 3.28 లక్షల కోట్లు. అత్యంత సంపన్న నాలుగో భారతీయ మహిళగా బైజూస్ కో ఫౌండర్ దివ్య గోకుల్ నాథ్ (35) నిలిచారు. రూ. 7,477 కోట్ల సంపదతో టాప్ 100 జాబితాలో ఆమె 47వ స్థానంలో నిలబడ్డారు.

ఐదవ స్థానాన్ని బయోకాన్ కు చెందిన కిరణ్ మజుందార్ షా (68) సొంతం చేసుకున్నారు. ఆమె సంపద విలువ రూ. 2.91 లక్షల కోట్లు. ఇక ఆరో స్థానంలో ట్రాక్టర్స్ అండ్ ఫామ్ ఎక్విప్ మెంట్ లిమిటెడ్ (టీఏఎఫ్ఈ)కి చెందిన మల్లిక శ్రీనివాసన్ నిలిచారు. ఆమె సంపద విలువ దాదాపు రూ. 2.16 లక్షల కోట్లు. మొత్తం జాబితాలో ఆమె 73వ స్థానంలో నిలిచారు.

More Telugu News