Ajay Bhupathi: నాకు నచ్చిన ప్యానల్ కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు ఇస్తానని ఒక డైరెక్టర్ నాతో చెప్పాడు: అజయ్ భూపతి

Director Ajay Bhupathi sensational tweet on MAA elections
  • టాలీవుడ్ లో కలకలం రేపుతున్న 'మా' ఎన్నికలు
  • ప్యానల్స్ మధ్య తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలు
  • ప్యానల్స్ గొడవతో సినీ పరిశ్రమ దెబ్బతినే అవకాశం
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి. సినీ ప్రముఖులు నిట్ట నిలువునా చీలిపోయారా అనే విధంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏ మాత్రం కంట్రోల్ లేకుండా ఎన్నికల్లో పోటీ పడుతున్న వారు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.

మరోవైపు ఒక ప్యానల్ కు సపోర్ట్ చేసిన వారికి... ఆ ప్యానల్ ను వ్యతిరేకించే వారు అవకాశాలు ఇవ్వకపోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తాజాగా డైరెక్టర్ అజయ్ భూపతి చేసిన ట్వీట్ ఇదే విషయాన్ని సూచిస్తోంది.

'నాకు నచ్చిన ప్యానల్ కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు రాస్తానని ఇప్పుడు నాతో ఒక డైరెక్టర్ చెప్పాడు' అంటూ అజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటే సినీ పరిశ్రమ దెబ్బతినడం ఖాయమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Ajay Bhupathi
Tollywood
MAA
Elections

More Telugu News