రైతులను మోసం చేసేందుకే సాగు చట్టాలపై తప్పుడు ప్రచారం: జీవీఎల్
- నూతన వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చిన కేంద్రం
- దేశంలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత
- గుంటూరులో బీజేపీ అవగాహన కార్యక్రమం
- హాజరైన బీజేపీ ఎంపీ జీవీఎల్
పంటల కనీస మద్దతు ధరను కేంద్రం ఏటా పెంచుతోందని వెల్లడించారు. పంట కొనుగోళ్లు గతంలో కంటే రెట్టింపు అయ్యాయని వివరించారు. కొత్త చట్టాల సాయంతో రైతులు ఎవరితోనైనా ఒప్పందం చేసుకోవచ్చని జీవీఎల్ స్పష్టం చేశారు. పంజాబ్ లో ఈ తరహా చట్టాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయని తెలిపారు. రైతులను పలు రకాలుగా దోచుకునేందుకే మార్కెట్ యార్డులని విమర్శించారు.