Preetham Jukalker: నెటిజన్ల దెబ్బకు సైబరాబాద్ పోలీసులను ట్యాగ్ చేసిన సమంత స్టయిలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్!

Preetham Jukalker tagged Cyberabad police on trolling
  • తీవ్ర సంచలనం సృష్టించిన సమంత, నాగచైతన్య వ్యవహారం
  • సమంత స్టయిలిస్ట్ జుకాల్కర్ ను టార్గెట్ చేసిన నెటిజన్లు
  • చిత్రవధ చేస్తున్నారంటూ వాపోయిన జుకాల్కర్
  • సైబరాబాద్ పోలీసులను ట్యాగ్ చేస్తూ పోస్టు
టాలీవుడ్ లో ఇటీవల తీవ్ర సంచలనం సృష్టించిన అంశం సమంత-నాగచైతన్యల విడాకుల వ్యవహారం. అందమైన జోడీగా పేరొందిన వీరిద్దరూ ఎందుకు విడిపోయారన్న కోణంలో నెటిజన్ల దృష్టి సమంత పర్సనల్ స్టయిలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ పై పడింది. గతంలో సమంతతో అతడి ఫొటోలు ఎంతటి కలకలం రేపాయో గుర్తించిన నెటిజన్లు... గత కొన్నిరోజుల నుంచి అతడిని ఆడుకుంటున్నారు.

నీవల్లే వారిద్దరూ విడిపోయారని, సమంత కాపురంలో నిప్పులు పోశావని ఘాటు వ్యాఖ్యలతో నెటిజన్లు విరుచుకుపడ్డారు. నెటిజన్లతో శక్తిమేర పోరాడిన ప్రీతమ్ జుకాల్కర్... ట్రోలింగ్ మరింత తీవ్రతరం కావడంతో చేసేది లేక సైబరాబాద్ పోలీసుల సాయం కోరాడు. తనపై ట్రోలింగ్ ను స్క్రీన్ షాట్ల రూపంలో పంచుకుని, సైబరాబాద్ పోలీసులను ట్యాగ్ చేశాడు. ఈ ట్రోలింగ్ వల్ల మానసిక చిత్రవధ అనుభవిస్తున్నానని వాపోయాడు. అభిమానులు కూడా తనకు సహకరించాలని, తనను ట్రోల్ చేస్తున్న వారి ఖాతాలపై రిపోర్ట్ చేయాలని కోరాడు.
Preetham Jukalker
Cyberabad
Police
Netizens
Samantha
Naga Chaitanya
Tollywood

More Telugu News