షూటింగు పార్టు పూర్తిచేసుకున్న 'అఖండ'

05-10-2021 Tue 18:04
  • బాలయ్యతో బోయపాటి మూడో మూవీ
  • కథానాయికగా ప్రగ్యా జైస్వాల్
  • ప్రతినాయకుడిగా శ్రీకాంత్
  • దీపావళికి రిలీజ్ అంటూ టాక్  
Akhanda movie update
బాలకృష్ణ - బోయపాటి నుంచి మూడో సినిమాగా 'అఖండ' రూపొందింది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సింహా', 'లెజెండ్' సంచలన విజయాలను అందుకోవడంతో, సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా తాజాగా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది.

ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ, 'అనుకున్న సమయానికి సక్సెస్ ఫుల్ గా పూర్తిచేశాము' అన్నట్టుగా బాలకృష్ణతో దర్శక నిర్మాతలు దిగిన ఒక స్టిల్ ను పోస్ట్ చేశారు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా చెప్పారు. దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన రిలీజ్ చేయనున్నారనే టాక్ మాత్రం వినిపిస్తోంది.

బాలకృష్ణ సరసన నాయికగా ప్రగ్యా జైస్వాల్ నటించగా, ఒక ముఖ్యమైన పాత్రలో పూర్ణ కనిపించనుంది. ఒక ప్రతినాయకుడిగా శ్రీకాంత్ నటించగా, కీలకమైన పాత్రలో జగపతిబాబు కనిపించనున్నాడు. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాతో బాలయ్య - బోయపాటి హ్యాట్రిక్ హిట్ కొడతారేమో చూడాలి.