Jagan: రాష్ట్రంలో డ్రగ్స్ ఆనవాళ్లే ఉండకూడదు: ఏపీ సీఎం జగన్ ఆదేశాలు

  • డ్రగ్స్ సరఫరాపై పూర్తి నిఘా ఉంచండి
  • యూనివర్శిటీలు, కాలేజీల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉండకూడదు
  • డ్రగ్స్ కట్టడిని సవాల్ గా తీసుకోవాలి
Jagan key orders on drugs

మన దేశంలో డ్రగ్స్ వినియోగం విచ్చలవిడిగా సాగుతోంది. టాలీవుడ్, బాలీవుడ్ లు డ్రగ్స్ వ్యవహారాలతో వణికిపోయాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం సంచలనం రేపింది. మరోవైపు ఇటీవలే గుజరాత్ లోని పోర్టులో దాదాపు రూ. 21,000 కోట్ల డ్రగ్స్ దొరకడం కలకలం రేపింది. ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఏపీ పేరు వెలుగు చూడటం కూడా తెలిసిందే.

ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ ఆనవాళ్లు కూడా కనిపించడానికి వీల్లేదని అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ ఎవరు పంపిణీ చేస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నాయి? అనే అంశంపై గట్టి నిఘా పెట్టాలని అన్నారు. యూనివర్శిటీలు, కాలేజీల్లో డ్రగ్స్ ఉండకూడదని చెప్పారు. డ్రగ్స్ కట్టడిని సవాల్ గా తీసుకోవాలని చెప్పారు. అక్రమ ఇసుక రవాణా, అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు.

More Telugu News