పండోరా పేపర్స్ లో జగన్ పేరు కూడా ఉండే అవకాశం ఉంది: టీడీపీ స్ట్రాటజీ కమిటీ

04-10-2021 Mon 21:55
  • విదేశాల్లో డబ్బు దాచుకున్న ప్రముఖులు
  • ఆయా ప్రముఖుల పేర్లతో కూడిన పండోరా పేపర్స్ వెల్లడి
  • టీడీపీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో దీనిపై చర్చ
  • వాస్తవాలు ప్రజలకు తెలపాలని నిర్ణయం
TDP Strategy committee discusses about Pandora papers

టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశం జరిగింది. వివిధ దేశాల ప్రముఖులు విదేశాల్లో డబ్బు దాచుకున్నారంటూ బహిర్గతమైన పండోరా పేపర్స్ అంశంపైనా ఈ సమావేశంలో చర్చించారు. పండోరా పేపర్స్ లో పన్ను ఎగవేతదారుల వివరాలు లీకయ్యాయని, భారత్ నుంచి దాదాపు 380 మంది వరకు ఈ వ్యవహారంలో ఉన్నారని కమిటీ పేర్కొంది.

వీరిలో ఏపీ సీఎం జగన్ పేరు కూడా ఉండే అవకాశం ఉందని, వీటన్నింటిపై పరిశోధించి ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని టీడీపీ స్ట్రాటజీ కమిటీ సభ్యులు తీర్మానించారు. షెల్ కంపెనీలు సృష్టించి అవినీతికి పాల్పడడంలో జగన్ దిట్ట అని అభిప్రాయపడ్డారు.