Ambati Rayudu: రాయుడు అర్ధసెంచరీ... చెన్నై సూపర్ కింగ్స్ 136-5

Ambati Rayudu unbeaten fifty against Delbi Capitals
  • ఐపీఎల్ లో ఢిల్లీ వర్సెస్ చెన్నై
  • మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై
  • 55 పరుగులతో అజేయంగా నిలిచిన రాయుడు
  • రాణించిన ఢిల్లీ బౌలర్లు
ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో చెన్నై జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమైంది. మిడిలార్డర్ బ్యాట్స్ మన్ అంబటి రాయుడు (55 నాటౌట్) అజేయ అర్ధసెంచరీ సాధించగా, నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై జట్టు 5 వికెట్లకు 136 పరుగులు చేసింది. ఊతప్ప 19, ధోనీ 18, గైక్వాడ్ 13, డుప్లెసిస్ 10 పరుగులు చేశారు.

గత కొన్ని మ్యాచ్ ల్లో విశేషంగా రాణిస్తున్న ఢిల్లీ బౌలర్లు ఈ మ్యాచ్ లోనూ రాణించారు. అక్షర్ పటేల్ 2, నోర్జే 1, ఆవేశ్ ఖాన్ 1, అశ్విన్ 1 వికెట్ తీశారు. చెన్నై బ్యాట్స్ మెన్ కు భారీ షాట్లు కొట్టే అవకాశం ఇవ్వకుండా కట్టడి చేశారు.

చెన్నై లైనప్ లో రాయుడు మాత్రం ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 43 బంతులాడిన రాయుడు 5 ఫోర్లు, 2 సిక్సులు బాదాడు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో ఢిల్లీ జట్టు 24 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన పృథ్వీ షా... దీపక్ చహర్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.
Ambati Rayudu
Fifty
Chennai Super Kings
Delhi Capitals
IPL

More Telugu News