'హలో' మ్యాగజైన్ కోసం నమ్రతతో మహేశ్ బాబు ఫొటోషూట్

04-10-2021 Mon 21:26
  • వైరల్ అవుతున్న ఫొటోలు
  • స్లిమ్ లుక్ తో మహేశ్ బాబు
  • మహేశ్ కు దీటుగా నమ్రత
  • మ్యాగజైన్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన మహేశ్ బాబు
  • ఇంటికి వస్తే సాధారణ వ్యక్తినే అని వెల్లడి 
Mahesh Babu and Namrata posed for Hello Magazine

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికీ యంగ్ అనే తీరులో మహేశ్ బాబు కనిపిస్తారు. ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా మహేశ్ బాబు ఎంతో ఫ్రెష్ గా ఉంటారు. తాజాగా ఆయన హలో మ్యాగజైన్ కోసం తన అర్ధాంగి నమ్రతతో ఫొటోషూట్ చేశారు. అందులోనూ స్లిమ్ లుక్ తో అలరించారు. హలో మ్యాగజైన్ కోసం తీసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

సదరు పత్రిక కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేశ్ మాట్లాడుతూ, నటనా రంగం అనేది తీవ్ర ఒత్తిళ్లతో కూడిన వ్యవహారం అని అభిప్రాయపడ్డారు. తన అనుభవం ప్రకారం... ఎంత ఒద్దికగా ఉంటే అంత తేలిగ్గా పని జరిగిపోతుందని వివరించారు. ఇక, ఇంటి వెలుపల తాను పెద్ద స్టార్ ని కావొచ్చేమో కానీ, ఇంటికి వస్తే తాను కూడా ఓ భార్యకు భర్తనే అని తెలిపారు. తన భార్య తనను వాస్తవ పరిస్థితిలోకి తీసుకువస్తుందని మహేశ్ బాబు వెల్లడించారు. తన పిల్లలు కూడా తనను ఓ సాధారణ తండ్రిలాగానే చూస్తారని వివరించారు.