Revanth Reddy: కోకాపేట భూముల వేలంపై కేంద్ర హోంశాఖ తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలి: రేవంత్ రెడ్డి డిమాండ్

  • ఇటీవల కోకాపేట భూముల వేలం
  • వేల కోట్ల స్కాం జరిగిందంటూ కాంగ్రెస్ ఆరోపణలు
  • ఇటీవల సీబీఐకి ఫిర్యాదు చేసిన రేవంత్
  • హెచ్ఎండీఏ కార్యాలయంలో డేటా మాయం అంటూ కథనాలు
Revanth Reddy demands CBI probe Kokapet land auction scam

కోకాపేట భూముల వేలంలో వేల కోట్ల రూపాయల స్కాం జరిగిందని తెలంగాణ కాంగ్రెస్ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. ఇటీవలే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దీనిపై సీబీఐకి కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ కార్యాలయం నుంచి భూముల వేలానికి సంబంధించిన కీలక డేటా మాయం అయిందంటూ పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీనిపై రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.

ఇటీవల తాను కోకాపేట భూముల వేలంపై సీబీఐకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో, హెచ్ఎండీఏ కార్యాలయం వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురికావడం పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. హెచ్ఎండీఏ కార్యాలయంలో ఉన్న సమాచారం అంతా మాయం కావడంతో ఇంటి దొంగల పాత్ర నిజమని తేలిందని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

More Telugu News