ఈ నెల 7వ తేదీన ప్రభాస్ 25వ సినిమా ఎనౌన్స్ మెంట్!

04-10-2021 Mon 12:03
  • జోరు మీదున్న 'సలార్' షూటింగ్
  • ఇటీవలే సెట్స్ పైకి వెళ్లిన 'ఆది పురుష్'
  • నాగ్ అశ్విన్ తో చేయనున్న సైన్స్ ఫిక్షన్
  • 25వ సినిమాకి మొదలైన సన్నాహాలు  
 Prabhas 25th movie announcement on October 7th

ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. వందల కోట్ల బడ్జెట్ తో ఆయన సినిమాలు రూపొందుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ఆయన వరుస సినిమాలు ఒప్పేసుకుంటూ, ఒకదాని తరువాత ఒకదానిని పట్టాలెక్కిస్తూ ఉండటం విశేషం. ఆయన స్పీడ్ చూసి బాలీవుడ్ హీరోలు సైతం టెన్షన్ పడిపోతున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ ఒక వైపున 'సలార్' షూటింగులో పాల్గొంటూనే, 'ఆది పురుష్' షూటింగుకి కూడా హాజరవుతున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత ఆయన నాగ్ అశ్విన్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఇది సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో నడిచే కథ కూడా. పాన్ ఇండియా సినిమాకి తాతలా ఉంటుందని అశ్విన్ చెప్పడం విశేషం. ఇది ప్రభాస్ కి 24వ సినిమా.  

ఇక తన 25వ సినిమాను ఆయన ఎవరితో .. ఎప్పుడు చేయనున్నాడు? అనే ఆసక్తి అందరిలోను తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో ఆయన 25వ సినిమాకి సంబంధించిన ఎనౌన్స్ మెంట్ ఈ నెల 7వ తేదీన రానుంది. ఆ సినిమాకి దర్శకుడు ఎవరు? ఎవరి బ్యానర్లో ఎప్పుడు మొదలుకానుంది? అనే విషయాలు ఆ రోజున తెలిసే అవకాశం ఉంది.