Priyanka Gandhi: ప్రియాంకను అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • యూపీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు
  • కారు దూసుకుపోయిన ఘటనలో నలుగురు రైతుల మృతి
  • బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంక
Police taken Priyanka Gandhi into custody

ఉత్తరప్రదేశ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన రైతులపై నుంచి కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు లక్నోలోని తన నివాసం నుంచి ఘటన జరిగిన లఖింపూర్ ఖేరీకి ప్రియాంక బయలుదేరారు. ఈ క్రమంలో ప్రియాంక ప్రయాణాన్ని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని... అందువల్ల అక్కడకు వెళ్లడానికి అనుమతి లేదని ప్రియాంకకు పోలీసులు తెలిపారు.
 
ఈ నేపథ్యంలో పోలీసులపై ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇంటి నుంచి బయటకురావడం నేరం కాదని అన్నారు. బాధిత కుటుంబాలను కలిసి వారి బాధను పంచుకోవడానికి వెళ్తున్నానని చెప్పారు. తాను తప్పు చేసి ఉంటే వారంట్ చూపించి కారును ఆపాలని అన్నారు. ఈ దేశం బీజేపీది కాదని... ఈ దేశం రైతులదని చెప్పారు. ఒకవేళ తనను బలవంతంగా పోలీసు కారులో ఎక్కిస్తే మీపై కిడ్నాప్ కేసు పెడతానని హెచ్చరించారు. ఈ  క్రమంలో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News