డ్ర‌గ్స్ కేసులో షారుక్‌ ఖాన్‌ కొడుకు అరెస్టయిన వేళ షారుఖ్ వ‌ద్ద‌కు వెళ్లిన‌ స‌ల్మాన్ ఖాన్‌.. వీడియో ఇదిగో

04-10-2021 Mon 11:26
  • గ‌త రాత్రి ఘ‌ట‌న‌
  • షారుఖ్‌కు స‌ల్మాన్ మ‌ద్ద‌తు
  • డ్ర‌గ్స్ కేసులో కొన‌సాగుతోన్న విచార‌ణ‌
salman meets sharukh
డ్రగ్స్ కేసులో షారుక్‌ ఖాన్‌ కొడుకు ఆర్యన్‌ ఖాన్‌ సహా మరికొందరు ప్రముఖుల పిల్లలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అరెస్టు చేయడం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైన విష‌యం తెలిసిందే. నిన్న షారుఖ్ ఖాన్ త‌న కొడుకు త‌ర‌ఫున వాదించ‌డానికి లాయ‌ర్‌ను కూడా పెట్టి ప‌లు ప్ర‌య‌త్నాలు జ‌రిపారు.

నిన్న సాయంత్రం వ‌ర‌కు ఆయ‌న కోర్టు వ‌ద్దే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ హీరో సల్మాన్‌ ఖాన్ గ‌త‌ రాత్రి దాదాపు 11 గంటలకు షారుక్‌ని కలవడానికి మన్నత్‌లోని బంగ్లాకు వెళ్లారు. షారుఖ్ ఖాన్‌, సల్మాన్ ఖాన్ మ‌ధ్య  విభేదాలు ఉన్నట్లు గతంలో వ‌దంతులు వ‌చ్చాయి. నిన్న వారిద్ద‌రు క‌లుసుకోవ‌డంతో వాటికి ఫుల్‌స్టాప్ ప‌డింది.

షారుఖ్ ఖాన్ కొడుకును ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేసిన నేప‌థ్యంలో షారుఖ్‌కి ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. డ్ర‌గ్ కేసులో అధికారులు త‌దుప‌రి విచార‌ణ కొన‌సాగిస్తున్నారు. నిన్న కొంద‌రిని కోర్టులో హాజ‌రుప‌ర్చారు. ఈరోజు కూడా ప‌లువురిని కోర్టు ముందు హాజ‌రుప‌ర్చ‌నున్నారు.