Aryan Khan: ఎన్సీబీ కస్టడీకి షారుఖ్‌ఖాన్‌ తనయుడు ఆర్యన్‌

Aryan Khan 2 others sent to 1day NCB custody in Mumbai cruise drugs case
  • సోమవారం వరకూ ఎన్సీబీ కస్టడీలో ఉండనున్న స్టార్ హీరో కుమారుడు
  • ఆర్యన్‌తో పాటు మరో ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్న  అధికారులు
  • రేవ్‌ పార్టీ రెయిడ్‌లో ఆర్యన్‌ సహా 8 మందిని అదుపులోకి తీసుకున్న ఎన్సీబీ
ముంబై నుంచి గోవా వెళ్తున్న క్రూయిజ్ నౌకలో రేవ్‌ పార్టీ జరుగుతోందని తెలుసుకున్న నార్కొటిక్స్ బ్యూరో అధికారులు ఆ నౌకపై రెయిడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రెయిడ్‌లో బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్ తనయుడు ఆర్యన్‌ సహా మొత్తం 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి ముంబైలోని జేజే మెడికల్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వీరిలో ముగ్గురుని మాత్రం తమ కస్టడీలోకి తీసుకున్నారు.

వీరిలో షారుఖ్ తనయుడు ఆర్యన్ కూడా ఉండటం గమనార్హం. ఆర్యన్‌తోపాటు అర్బాజ్ సేత్ మర్చంట్, మున్‌మున్‌ దమేచాను అధికారులు రిమాండ్‌కు తరలించారు. వీరు ముగ్గురూ సోమవారం వరకూ ఎన్సీబీ కస్టడీలో ఉంటారు. అయితే వీరిని రెండ్రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఎన్సీబీ కోరినట్లు తెలుస్తోంది
Aryan Khan
drugs
Mumbai

More Telugu News