అతికష్టమ్మీద 115 పరుగులు చేసిన సన్ రైజర్స్

03-10-2021 Sun 21:11
  • ఐపీఎల్ లో నేడు సన్ రైజర్స్ వర్సెస్ కోల్ కతా
  • మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్
  • 26 పరుగులు చేసిన కేన్ విలియమ్సన్
  • రెండేసి వికెట్లు తీసిన సౌథీ, మావి, వరుణ్
SRH posts low score against KKR

ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ వైఫల్యాలు కొనసాగుతున్నాయి. కోల్ కతా నైట్ రైడర్స్ తో నేటి మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆ జట్టుకు ఏదీ కలిసి రాలేదు. నిర్ణీత 20 ఓవర్లలో పడుతూ లేస్తూ ఆడిన సన్ రైజర్స్ 8 వికెట్లకు 115 పరుగులు చేసింది. 26 పరుగులు చేసిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టులో టాప్ స్కోరర్. అబ్దుల్ సమద్ 25, ప్రియమ్ గార్గ్ 21 పరుగులు చేశారు.

కోల్ కతా బౌలర్లలో టిమ్ సౌథీ 2, శివం మావి 2, వరుణ్ చక్రవర్తి 2, షకీబ్ అల్ హసన్ 1 వికెట్ తీశారు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి సన్ రైజర్స్ ఇప్పటికే నిష్క్రమించిన సంగతి తెలిసిందే.