Qatar: కతార్ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులకు చేదు అనుభవం

  • ఓటమి చవిచూసిన 26 మంది మహిళా అభ్యర్థులు
  • తొలి లెజిస్లేటివ్ ఎన్నికల్లో 63.5 శాతం ఓటింగ్
  • మొత్తం 45 మందితో కూడిన షురా మండలిలో 30 సీట్లకు ఎన్నికలు
All 26 women candidates in Qatars 1st legislative elections lose

గల్ఫ్ దేశం కతార్‌లో జరిగిన తొలి లెజిస్లేటివ్ ఎన్నికల్లో మహిళలకు చేదు అనుభవం ఎదురైంది. కతార్‌లో షురా సలహా మండలిలో మొత్తం 45 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 30 మందిని ఎన్నుకోవడం కోసం ఎలక్షన్లు పెట్టారు. మిగిలిన 15 మందిని నేరుగా ఎమిర్ (దేశపాలకుడు) నియమిస్తాడు. ఈ 30 మందిలో అందరూ పురుషులే ఉండకూడదనే తలంపుతో 26 మంది మహిళలు ఎన్నికల్లో నిలబడ్డారు. కానీ వీరందరికీ చేదు అనుభవమే ఎదురైంది. ఎన్నికల్లో మొత్తం 63.5 శాతం ఓటింగ్‌ నమోదైంది. అయినా సరే ఒక్క మహిళా అభ్యర్థి కూడా విజయం సాధించలేదు. మొత్తం 26 మంది ఓటమినే చవిచూశారు.

More Telugu News