Priyanka Tibrewal: ఓడినా నేనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్... మమతా ప్రత్యర్థి ప్రియాంక టిబ్రేవాల్ వ్యాఖ్యలు

Priyanka Tibrewal declares herself as Man Of The Match in Bhabanipur By Elections
  • భవానీపూర్ ఉప ఎన్నికల్లో మమత గెలుపు
  • ప్రియాంకా టిబ్రేవాల్ పై విజయం
  • మమత కంచుకోటలో 25 వేల ఓట్లు తెచ్చుకున్నానన్న ప్రియాంక
  • మమత ఎలా గెలిచిందో అందరూ చూశారన్న బీజేపీ నేత

దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన భవానీపూర్ ఉప ఎన్నికలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీనే విజయం వరించింది. ఆమె తన ప్రత్యర్థి, బీజేపీ నేత ప్రియాంకా టిబ్రేవాల్ పై 58 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో నెగ్గారు. కాగా, తన ఓటమిపై ప్రియాంకా టిబ్రేవాల్ స్పందించారు. ఈ ఉప ఎన్నికలో ఓడినప్పటికీ తానే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని ప్రకటించుకున్నారు.

మమతా బెనర్జీకి కంచుకోట లాంటి నియోజకవర్గంలో తాను పోటీ చేశానని, పైగా 25 వేలకు పైగా ఓట్లను పొందానని ప్రియాంక గర్వంగా చెప్పారు. ఇకపైనా తాను కష్టించి పనిచేస్తానని తెలిపారు. అయితే తన ఓటమిని హుందాగా అంగీకరిస్తున్నానని, దీనిపై తాను కోర్టుకు వెళ్లబోనని స్పష్టం చేశారు.

కానీ టీఎంసీ నేతలు మమత లక్ష మెజారిటీతో గెలుస్తుందని చెప్పారని, కానీ ఆమెకు లభించిన ఆధిక్యం 58 వేలు మాత్రమేనని ప్రియాంక వివరించారు. విజయం సాధించిన మమతా బెనర్జీకి అభినందనలు తెలియజేస్తున్నానని, కానీ ఆమె ఎలా గెలిచిందో అందరూ చూశారని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News