రాజస్థాన్ ఓపెనర్ కు ఆటోగ్రాఫ్ ఇచ్చిన ధోని.. పిక్ వైరల్

03-10-2021 Sun 15:17
  • హాఫ్ సెంచరీతో దుమ్మురేపిన జైశ్వాల్
  • మ్యాచ్ అనంతరం ధోనీని కలిసిన యువ బ్యాట్స్ మ్యాన్
  • బ్యాటుపై ధోని సంతకంతో దిగిన ఫోటో వైరల్
RRs Yashasvi Jasiwal gets his bat signed by MS Dhoni after win pic surfaces
రాజస్థాన్ యువ బాట్స్ మ్యాన్ యశస్వి జైశ్వాల్ బ్యాట్ పై చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోని సంతకం చేశాడు. శనివారం ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో జైశ్వాల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. అతనితో పాటు శివమ్ దూబే కూడా రాణించడంతో రాజస్థాన్ జట్టు విజయం సాధించింది. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం ధోనీని కలిసిన జైశ్వాల్ తన బ్యాటుపై ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. ఈ బ్యాటుతో జైశ్వాల్ ఉన్న ఫోటో ను ఐపీఎల్ ట్విట్టర్ లో షేర్ చేసింది.

దీంతోపాటు "మ్యాచ్ తర్వాత నా బ్యాటుపై ధోని సంతకం తీసుకున్నా. చాలా సంతోషంగా ఉంది" అని జైశ్వాల్ అన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది. కాగా, ఈ మ్యాచ్ లో చెన్నై ఓపెనర్ రుతురాజ్ సెంచరీ తో అదరగొట్టాడు. కానీ అతని టీం ఓడిపోయింది.