RCB: ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు... పంజాబ్ పై టాస్ గెలిచిన బెంగళూరు

RCB won the toss against Punjab Kings in do or die clash
  • షార్జాలో బెంగళూరు వర్సెస్ పంజాబ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు
  • గెలిస్తే ప్లే ఆఫ్ దశకు చేరనున్న బెంగళూరు
  • పంజాబ్ జట్టులో మూడు మార్పులు
  • నేటి రెండో మ్యాచ్ లో కోల్ కతా వర్సెస్ హైదరాబాద్
చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నేడు పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ దశలో అడుగుపెడుతుంది. షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

బెంగళూరు జట్టులో ఈ మ్యాచ్ కోసం ఎలాంటి మార్పులు లేకపోగా, పంజాబ్ జట్టులో మాత్రం ఏకంగా మూడు మార్పులు జరిగాయి. ఫాబియన్ అలెన్ స్థానంలో హర్ ప్రీత్, దీపక్ హుడా స్థానంలో సర్ఫరాజ్ ఖాన్, ఎల్లిస్ స్థానంలో మోజెస్ హెన్రిక్స్ తుదిజట్టులోకి వచ్చారని పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వెల్లడించాడు.

ఇక ఇవాళ జరిగే రెండో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది.
RCB
Toss
Punjab Kings
Sharjah
IPL

More Telugu News