బాలయ్య, మంచు విష్ణు ఖుషీ ఖుషీగా... ఫొటోలు ఇవిగో!

03-10-2021 Sun 14:14
  • అక్టోబరు 10న మా ఎన్నికలు
  • మంచు విష్ణు ముమ్మర ప్రచారం
  • సీనియర్ నటులతో భేటీలు
  • తాజాగా బాలకృష్ణతో సమావేశం
  • అఖండ సెట్స్ కు వెళ్లిన మంచు విష్ణు
Manchu Vishnu met Nandamuri Balakrishna

'మా' ఎన్నికల్లో గెలుపే పరమావధిగా ముమ్మర ప్రచారం సాగిస్తున్న నటుడు మంచు విష్ణు వరుసగా సీనియర్ హీరోలను కలుస్తూ మద్దతు కూడగడుతున్నారు. తాజాగా మంచు విష్ణు అగ్రహీరో నందమూరి బాలకృష్ణను కలిశారు. ఇవాళ ఉదయం 'అఖండ' చిత్రం సెట్స్ పై బాలయ్యతో భేటీ అయ్యారు. 'మా' ఎన్నికల్లో తన ప్యానెల్ కు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. తన ప్యానెల్ గెలిస్తే ఏమేం చేస్తామో బాలయ్యకు వివరించారు. అనంతరం మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా వివరాలు తెలిపారు. బాలకృష్ణ మద్దతు తమకేనని ప్రకటించారు.

"థాంక్యూ ఫర్ వన్ అండ్ ఓన్లీ నటసింహం. బాలా అన్నా... 'మా' ఎన్నికల వేళ మీ మద్దతుకు, మీ ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు. మీ వంటి వారు మా వెన్నంటి ఉండడం గౌరవంగా భావిస్తున్నాను" అంటూ మంచు విష్ణు స్పందించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.