Telangana: ఉద్యోగం లేదన్న కారణంతో పెళ్లికి నిరాకరించిన యువతి తల్లిదండ్రులు.. మనస్తాపంతో ఉరేసుకున్న యువకుడు

Young man commits Suicide for refuse marry with loving girl
  • వికారాబాద్ మండలం మైలార్‌దేవరంపల్లిలో ఘటన
  • ఉద్యోగం లేకపోవడంతో పెళ్లికి నిరాకరించిన యువతి తల్లిదండ్రులు
  • ఇంటి నుంచి వెళ్లిపోయి చెట్టుకు ఉరేసుకున్న యువకుడు
మనసు పడిన యువతిని పెళ్లి చేసుకోవాలని భావించిన యువకుడు అది నెరవేరే మార్గం కనిపించకపోవడంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వికారాబాద్ మండలం మైలార్‌దేవరంపల్లిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వెంకటయ్య (22) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసేవాడు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగం పోవడంతో తిరిగి గ్రామానికి చేరుకున్నాడు.

ఈ క్రమంలో గ్రామానికే చెందిన యువతిపై మనసు పారేసుకున్నాడు. పెళ్లంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కూడా అంగీకరించారు. మంచి రోజు చూసుకుని యువతి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి సంబంధం కోసం మాట్లాడారు. అయితే, యువకుడికి ఉద్యోగం లేకపోవడంతో పెళ్లికి నిరాకరించారు. అయినప్పటకీ ఆమెనే పెళ్లి చేసుకుంటానని యువకుడు తేల్చి చెప్పాడు.

దీంతో ఇతరుల ద్వారా యువతి తల్లిదండ్రులను ఒప్పించేందుకు యువకుడి కుటుంబ సభ్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన వెంకటయ్య ఈ నెల 1న ఇంట్లోంచి వెళ్లిపోయి గ్రామంలోని చెట్టుకు ఉరేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Telangana
Vikarabad District
Suicide
Crime News

More Telugu News