పొరుగింటి కుక్కపై అత్యాచారం చేసిన 67 ఏళ్ల వృద్ధుడు

02-10-2021 Sat 20:32
  • గురుగ్రామ్‌లో వెలుగు చూసిన దారుణం
  • ఇంట్లో కనిపించని పెంపుడు కుక్క
  • పక్కింట్లో నుంచి కుక్క అరుపు వినపడిన వైనం
  • వెళ్లి చూస్తే కంటబడిన ఘోరం
67 years old person raped a dog
దేశంలో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా అనిపించే ఘటన ఒకటి తాజాగా వెలుగు చూసింది. ఒక 67 ఏళ్ల వృద్ధుడు పొరుగింట్లో ఉండే ఒక ఆడ శునకంపై లైంగిక దాడి చేశాడు. ఈ ఘటన దేశరాజధానికి సమీపంలో హరియాణాలోని గురుగ్రామ్‌లో వెలుగు చూసింది. సురేశ్ అనే 67 ఏళ్ల వ్యక్తి పక్కింట్లో ముఖేశ్ అనే వ్యక్తి ఉంటున్నాడు.

ముఖేశ్ వాళ్ల ఇంట్లో రెండు కుక్కల్ని పెంచుకుంటున్నాడు. వాటిలో భురి అనే ఆడ శునకం రాత్రిపూట కనిపించలేదు. దానికోసం ముఖేశ్ వెతుకుతూ బయటకు వచ్చాడు. కాసేపటికి పక్కింట్లో నుంచి కుక్క అరుపు వినిపించి అటుగా వెళ్లాడు. అక్కడ అతనికి ఘోరమైన దృశ్యం కంటపడింది.

తన శునకంపై సురేశ్ వికృత చర్యకు పాల్పడుతూ కనిపించాడు. వెంటనే తన మొబైల్‌లో ఈ ఘోరాన్ని రికార్డు చేసిన ముఖేశ్ ఆ మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడంటూ తొలుత సురేశ్ బుకాయించాడు. కానీ తన వద్ద వీడియో ఆధారం ఉందని ముఖేశ్ చెప్పడంతో నిమ్మకుండిపోయాడు. ఐపీసీ సెక్షన్ 377 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు సురేశ్ ‌ను అరెస్టు చేశారు.