Pawan Kalyan: ఐపీఎస్ చేసిన మీరు నేరచరితులకు సెల్యూట్ చేస్తుంటే మా మనసు చచ్చిపోతోంది సార్!: పవన్ కల్యాణ్

Pawan Kalyan questions police
  • రాజమండ్రిలో పవన్ ప్రసంగం
  • పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం
  • జనసేన కార్యకర్తలను చావబాదారని ఆరోపణ
  • రోడ్ల మీదకు రాక ఇంకేం చేస్తామన్న జనసేనాని

రాజమండ్రి సభలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆవేశపూరితంగా ప్రసంగించారు. తన రాక నేపథ్యంలో జనసేన కార్యకర్తలను పోలీసులు చావగొట్టారని, వారి బైకులు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారని పవన్ ఆరోపించారు.

"పోలీస్ శాఖ ఉన్నతాధికారులను ఒకటే అడుగుతున్నా. ఐపీఎస్ వంటి ఉన్నత చదువులు చదివిన పెద్దవాళ్లు సార్ మీరు. అందరికీ మార్గదర్శకుల్లా నిలవాల్సినవాళ్లు మీరు. అలాంటిది మీరు వెళ్లి ఒక క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్లకు సెల్యూట్ చేస్తుంటే మనసు చచ్చిపోతోంది. చాలా బాధగా ఉంది.

ప్రజల హక్కుల్ని కాపాడతాం, ప్రజల హక్కులకు భంగం కలిగించమని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిణిగా ఉన్న వ్యక్తి ప్రమాణం చేసి ఉంటారు. మా వాళ్లందరినీ చావగొట్టి వైసీపీ పక్షాన నిలిస్తే, మరి మీ ఐఏఎస్, ఐపీఎస్ చదువులు ఎందుకు? మీకు బాధగా అనిపించడంలేదా? మీరు కూడా నేరచరితులకు వంతపాడుతుంటే మేం రోడ్ల మీదకు రాక ఇంకేం చేస్తాం? మాకేమైనా రోడ్ల మీదకు రావడం సరదా అనుకుంటున్నారా? అధికార యంత్రాంగం ఎవరి పని వారు చేయకపోతే మేం ఇలాగే రోడ్లపైకి వచ్చి నిలదీస్తాం" అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News