ఏపీలో మరో 865 మందికి కరోనా పాజిటివ్

02-10-2021 Sat 18:13
  • గత 24 గంటల్లో 50,304 కరోనా పరీక్షలు
  • తూర్పు గోదావరి జిల్లాలో 172 కొత్త కేసులు
  • రాష్ట్రంలో 9 మంది మృతి
  • ఇంకా 10,574 మందికి చికిత్స
AP corona cases media bulletin

ఏపీలో గడచిన 24 గంటల్లో 50,304 కరోనా పరీక్షలు నిర్వహించగా, 865 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 172 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 168, గుంటూరు జిల్లాలో 117 కేసులు వెల్లడయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 100కి లోపే కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా శ్రీకాకుళం, కర్నూలు జిల్లాలలో 4 కేసుల చొప్పున గుర్తించారు.

అదే సమయంలో 1,424 మంది ఆరోగ్యవంతులు కాగా, 9 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,51,998 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,27,229 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 10,574 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,195కి పెరిగింది.