Pawan Kalyan: పార పట్టి శ్రమదానం చేసిన పవన్ కల్యాణ్... ఫొటోలు ఇవిగో!

Pawan Kalyan works at a road in Rajahmundry
  • ఏపీలో రోడ్ల పరిస్థితిపై జనసేన పోరాటం
  • గాంధీ జయంతి నాడు శ్రమదానం చేస్తానని పవన్ ప్రకటన
  • చెప్పినట్టుగానే శ్రమదానం చేసిన వైనం
  • స్వయంగా రోడ్లపై గుంతలు పూడ్చిన పవన్
జనసేనాని పవన్ కల్యాణ్ తన పంతం నెగ్గించుకున్నారు! ఏపీలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, గాంధీ జయంతి నాడు శ్రమదానం చేస్తానని ప్రకటించిన ఆయన, రాజమండ్రిలోని హుకుంపేట బాలాజీ నగర్ ప్రాంతంలో రోడ్లకు మరమ్మతు చేశారు. స్వయంగా పార పట్టుకున్న పవన్ కాంక్రీటు మిశ్రమాన్ని జనసైనికుల గంపల్లో వేశారు. తాను కూడా కాంక్రీటు మిశ్రమాన్ని ఓ గంపలోకి తీసుకుని రోడ్డుపై నీరు నిలిచిన ఓ గుంతను పూడ్చే యత్నం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
Pawan Kalyan
Shrama Danam
Rajahmundry
Janasena

More Telugu News