Shakira: సరదాగా పార్కుకు వెళ్లిన పాప్ సింగర్ షకీరాపై అడవి పందుల దాడి

Wild bores attacks on pop singer Shakira
  • బార్సిలోనాలో షకీరాకు చేదు అనుభవం
  • కుమారుడితో కలిసి పార్కుకు వెళ్లిన షకీరా
  • షకీరా బ్యాగ్ ను లాగేసుకున్న అడవి పందులు
  • లబోదిబోమన్న షకీరా
ప్రఖ్యాత పాప్ గాయని షకీరాకు ఇటీవల చేదు అనుభవం ఎదురైంది. కుమారుడితో కలిసి సరదాగా పార్కుకు వెళ్లిన ఆమెపై రెండు అడవి పందులు దాడి చేశాయి. షకీరా బ్యాగ్ ను నోటకరుచుకున్న ఆ అడవి పందులు సమీపంలోని అటవీప్రాంతంలోకి పరుగులు తీశాయి. పందులదాడిలో ఆ బ్యాగ్ బాగా చిరిగిపోయింది. ఆందులో విలువైన ఫోన్ కూడా ఉందని షకీరా వెల్లడించింది.

చిందరవందరగా మారిన తన బ్యాగ్ ను ఆ కొలంబియన్ పాప్ స్టార్ సోషల్ మీడియాలో అందరికీ చూపించింది. తన ఎనిమిదేళ్ల కొడుకు మిలాన్ తో బార్సిలోనా నగరంలో ఓ పార్కుకు వెళ్లిన సందర్భంగా ఈ ఘటన జరిగింది. ప్రఖ్యాత ఫుట్ బాల్ ఆటగాడు గెరార్డ్ పిక్ తో షకీరా చాన్నాళ్లుగా సహజీవనం చేస్తోంది. వీరికి సాషా పిక్ మెబారక్, మిలాన్ పిక్ మెబారక్ అనే ఇద్దరు పిల్లలున్నారు.
Shakira
Wild Bores
Park
Barcelona

More Telugu News