రవితేజ 69వ సినిమా ప్రారంభానికి ముహూర్తం ఖరారు!

02-10-2021 Sat 12:07
  • విడుదలకి సిద్ధమైన 'ఖిలాడి'
  • సెట్స్ పైకి 'రామారావు ఆన్ డ్యూటీ'
  • త్రినాథరావుతో కొత్త ప్రాజెక్టు
  • ఈ నెల 4వ తేదీన షూటింగ్ ప్రారంభం
Raviteja in Nakkina Trinatha Rao movie

రవితేజకి మాస్ మహారాజ్ అనే బిరుదు ఉంది. తన సినిమాల్లో మాస్ కంటెంట్ పుష్కలంగా ఉండేలా ఆయన చూసుకుంటాడు. డైలాగ్స్ .. సాంగ్స్ .. ఫైట్స్ విషయంలో ఆయన మాస్ ఆడియన్స్ ను మరింతగా దృష్టిలో పెట్టుకుంటాడు. ఇక దర్శకుడిగా నక్కిన త్రినాథరావు కూడా మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసినవాడే.

అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ నెల 4వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయడానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. కెరియర్ పరంగా చూసుకుంటే రవితేజకి ఇది 69వ సినిమా అవుతుంది.

విశ్వప్రసాద్ .. వివేక్ కూచిభొట్ల .. అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి కథానాయికల విషయంలో క్లారిటీ రావలసి ఉంది. ఇక రవితేజ 'ఖిలాడి' రిలీజ్ కి రెడీ అవుతుండగా, 'రామారావు ఆన్ డ్యూటీ' షూటింగు దశలో ఉంది.