Pawan Kalyan: దారి పొడ‌వునా ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఘన స్వాగతం పలుకుతున్న అభిమానులు.. వీడియో ఇదిగో

pawan  reaches ap
  • కాసేప‌ట్లో బాలాజీపేట సెంటర్‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • హుకుంపేట-బాలాజీపేట రోడ్డు మీద‌ శ్రమదానం
  • ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లుకుతోన్న స్థానికులు
  • అభివాదం చేస్తూ కాన్వాయ్‌లో వెళ్తున్న ప‌వ‌న్
శ్ర‌మ‌దానం కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డానికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌మండ్రి చేరుకున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కు ఎయిర్ పోర్టు వ‌ద్ద అభిమానులు ఘ‌నస్వాగ‌తం ప‌లికారు. రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి బయల్దేరిన పవన్ క‌ల్యాణ్ బాలాజీపేట సెంటర్‌కు వెళ్తున్నారు. హుకుంపేట-బాలాజీపేట రోడ్డు మీద‌ శ్రమదానం చేయనున్నారు.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు అభిమానులు అడుగ‌డుగునా నీరాజ‌నం ప‌డుతున్నారు. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, అభిమానుల‌కు ప‌వ‌న్ అభివాదం చేస్తూ కాన్వాయ్‌లో ముందుకు క‌దులుతున్నారు.   శ్రమదానం తర్వాత బహిరంగ సభలో పవన్ కల్యాణ్ పాల్గొంటారు. బాలాజీపేట పరిసరాల్లో ఎలాంటి ఆంక్షలు లేవని ఏఎస్పీ అంటున్నారు. మ‌రోవైపు ఏపీ వ్యాప్తంగా జ‌న‌సేన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు శ్ర‌మ‌దానం కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నారు.  

                             
       
Pawan Kalyan
Janasena
rajamahendeavaram

More Telugu News