'పుష్ప' రిలీజ్ డేట్ ఖరారు .. అధికారిక ప్రకటన!

02-10-2021 Sat 10:34
  • ముగింఫై దశలో 'పుష్ప'
  • క్రిస్మస్ కి రాదంటూ ప్రచారం 
  • రంగంలోకి దిగిన నిర్మాతలు 
  • డిసెంబర్ 17న రిలీజ్ అంటూ ప్రకటన
Pushpa release date confirmed

అల్లు అర్జున్ -  సుకుమార్ కాంబినేషన్లో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్తంశెట్టి మీడియా వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారనే సంగతి తెలిసిందే. ఫస్టు పార్టుకు సంబంధించిన షూటింగు దాదాపు పూర్తి కావొచ్చింది.

ఈ సినిమాను 'క్రిస్మస్'కు విడుదల చేయనున్నట్టు చెప్పారు. అయితే అనుకున్న విధంగా పనులు పూర్తికాని కారణంగా, అప్పటికి ఈ సినిమా థియేటర్లకు రాకపోవచ్చనే ఒక టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. ఇదే సమయంలో 'ఆచార్య' క్రిస్మస్ రానుందనే ప్రచారం ఊపందుకుంది. దాంతో 'పుష్ప' ప్లేస్ లో 'ఆచార్య' రానుందని చెప్పుకుంటున్నారు.

దాంతో ఈ సినిమా మేకర్స్ .. ఈ ప్రచారానికి తెరదించడానికి రంగంలోకి దిగారు. 'పుష్ప' సినిమాను డిసెంబర్ 17వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఆ విషయాన్ని స్పష్టం చేసే పోస్టర్ ను వదిలారు. ఇక ఈ విషయంలో ఎలాంటి ఊహాగానాలకు తావు లేకుండా చేశారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రష్మిక లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.