YS Jagan: రెండు రోజుల కడప పర్యటనకు వెళుతున్న వైఎస్ జగన్

CM Jagan going to Kadapa trip
  • ఈరోజు, రేపు కడప జిల్లాలో పర్యటించనున్న జగన్
  • ఈ రాత్రికి ఇడుపులపాయలో బస చేయనున్న సీఎం
  • రేపు భారతి తండ్రి గంగిరెడ్డి ప్రథమ వర్ధంతి 
  • గంగిరెడ్డి సమాధి వద్ద నివాళి అర్పించనున్న జగన్
ముఖ్యమంత్రి జగన్ మరోసారి తన సొంత జిల్లా పర్యటనకు వెళుతున్నారు. ఈరోజు, రేపు రెండు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో ఇడుపులపాయకు చేరుకోనున్నారు. ఈ రాత్రికి ఆయన ఇడుపులపాయలోనే బస చేయనున్నారు.

రేపు ఉదయం ఆయన భార్య భారతి తండ్రి ప్రథమ వర్ధంతి సందర్భంగా పులివెందుల తోటలోని గంగిరెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్ లు పరిశీలించారు. హెలిపాడ్, సీఎం బస చేసే నివాసం వద్ద భద్రత విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు.
YS Jagan
YSRCP
Kadapa District

More Telugu News