దేశంలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌

02-10-2021 Sat 09:46
  • కొత్త‌గా 24,354 క‌రోనా కేసులు
  • మొత్తం కేసుల సంఖ్య‌ 3,37,91,061
  • మృతుల సంఖ్య మొత్తం 4,48,573
  • కేర‌ళలో కొత్త‌గా 13,834 కేసులు  
corona bulletin in inida

దేశంలో కొత్త‌గా 24,354 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య‌ 197 రోజుల క‌నిష్ఠానికి చేరుకుంది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్లలో 2,73,889 మంది చికిత్స తీసుకుంటున్నారు. మొత్తం కేసుల సంఖ్య‌ 3,37,91,061కు చేరింది.

ఇప్ప‌టివ‌ర‌కు 3,30,68,599 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 4,48,573గా ఉంది. దేశంలో కొత్త‌గా న‌మోదైన 24,354 క‌రోనా కేసుల్లో కేర‌ళ నుంచే 13,834 కేసులు ఉన్నాయి. ఆ రాష్ట్రంలో నిన్న 95 మంది ప్రాణాలు కోల్పోయారు.