తెలంగాణలో కొత్తగా 220 కరోనా కేసులు

01-10-2021 Fri 20:45
  • గత 24 గంటల్లో 46,193 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 67 కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 4,599 మందికి చికిత్స
Telangana registers two hundred plus more corona cases

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 46,193 కరోనా పరీక్షలు నిర్వహించగా, 220 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 67 కొత్త కేసులు నమోదు కాగా, వరంగల్ అర్బన్ జిల్లాలో 18, రంగారెడ్డి జిల్లాలో 15 కేసులు గుర్తించారు. నిర్మల్, నారాయణపేట, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 244 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,66,183 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,57,665 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 4,599 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాల సంఖ్య 3,919కి పెరిగింది.