Allu Ramalingaiah: అల్లు రామలింగయ్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించడంపై అల్లు అర్జున్ స్పందన

Allu Arjun thanked Chiranjeevi for unveiling Allu Ramalingaiah statue in Rajahmundry
  • నేడు అల్లు రామలింగయ్య 100వ జయంతి
  • రాజమండ్రిలో కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన చిరు
  • చిరంజీవి మాటలు హృదయాన్ని తాకాయన్న బన్నీ
  • చిరంజీవికి హృదయపూర్వక కృతజ్ఞతలు
హాస్య నట దిగ్గజం అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా రాజమండ్రిలో ఆయన కాంస్య విగ్రహాన్ని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. తన మామగారి జయంతి నాడు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా పేర్కొన్నారు. దీనిపై, అల్లు రామలింగయ్య మనవడు అల్లు అర్జున్ స్పందించారు.

రాజమండ్రిలో అల్లు రామలింగయ్య విగ్రహాన్ని చిరంజీవి గారు ఆవిష్కరించడం సంతోషదాయకమని పేర్కొన్నారు. చనిపోయిన మా తాతగారి గురించి చిరంజీవి గారు మాట్లాడిన మాటలు హృదయానికి హత్తుకున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆయనకు నేను, మా అల్లు కుటుంబం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అని వెల్లడించారు.
Allu Ramalingaiah
Centinary Birth Anniversary
Chiranjeevi
Statue
Allu Arjun
Rajahmundry
Tollywood

More Telugu News