QUAD: క్వాడ్ ను ఏర్పాటు చేసింది చైనా కోసం కాదు: అమెరికా

  • నాలుగు దేశాల మధ్య సంబంధాలు మెరుగయ్యాయన్న పెంటగాన్
  • ఎప్పుడూ చైనా దూకుడుపైనే చర్చలు జరుగుతున్నాయని కామెంట్
  • ఇటీవల అమెరికాలో క్వాడ్ ప్రత్యక్ష సమావేశాలు
Pentagon Responds On Quad Meeting

ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడు, బెదిరించే స్వభావంపైనే ఎప్పుడూ క్వాడ్ గ్రూప్ లో చర్చలు జరుగుతున్నాయని, అయితే, అది కేవలం చైనా గురించే ఏర్పాటు చేసింది కాదని పెంటగాన్ తెలిపింది. చైనా ప్రభావాన్ని తగ్గించేందుకే క్వాడ్ ను ఏర్పాటు చేయలేదని వెల్లడించింది. క్వాడ్ గ్రూప్ తో నాలుగు దేశాల మధ్య సంబంధాలు మెరుగయ్యాయని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బీ చెప్పారు.

కావాల్సిన వాతావరణాన్ని సృష్టించుకునేందుకు వీలుగా పెంటగాన్ కు అనేక అవకాశాలను క్వాడ్ కల్పించిందని తెలిపారు. కాగా, కరోనా తర్వాత ఇటీవల అమెరికాలో తొలిసారిగా క్వాడ్ ప్రత్యక్ష సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని యొషిహిడే సూగా, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ లు ఇండో పసిఫిక్ ప్రాంతంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇటు తొలిసారి బైడెన్ తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు.

More Telugu News