Chiranjeevi: అల్లు రామలింగయ్యతో నాకు తొలి పరిచయం ఎక్కడ జరిగిందంటే..: చిరంజీవి

Chiranjeevi speaks about Allu Ramalingaiah
  • 'మన ఊరి పాండవులు' సినిమా షూటింగ్ లో అల్లు రామలింగయ్యతో పరిచయం ఏర్పడింది
  • అనుకున్నది సాధించేందుకు ఆయన ఎంతో కష్టపడేవారు
  • హోమియోపై పరీక్షలు రాసి సర్టిఫికెట్ పొందారు
ప్రముఖ సినీ నటుడు, దివంగత అల్లు రామలింగయ్య విగ్రహాన్ని రాజమండ్రిలో చిరంజీవి ఆవిష్కరించారు. అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత అల్లు రామలింగయ్య హోమియో ఆసుపత్రి నూతన భవనాన్ని ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నటుడిగా తనకు జన్మనిచ్చింది రాజమండ్రి అని చెప్పారు. తాను నటించిన రెండు, మూడు సినిమాలు రాజమండ్రి చుట్టుపక్కల షూటింగులు జరుపుకున్నాయని తెలిపారు. 'మన ఊరి పాండవులు' సినిమా షూటింగ్ సందర్భంగా అల్లు రామలింగయ్యతో తనకు తొలిసారి పరిచయం ఏర్పడిందని తెలిపారు.

అనుకున్న లక్ష్యాలను సాధించడానికి అల్లు రామలింగయ్య ఎంతో కష్టపడేవారని చిరంజీవి తెలిపారు. ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే... మరోవైపు హోమియోపై పరీక్షలు రాసి సర్టిఫికెట్ పొందారని చెప్పారు. తమ కుటుంబ సభ్యులంతా హోమియో మందులనే వాడతామని తెలిపారు. హోమియోలో మంచి మందులు ఉన్నాయని చెప్పారు.
Chiranjeevi
Allu Ramalingaiah
Statue

More Telugu News