టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం.. ఇకపై ప్రతినెల ఒకటో తేదీనే వేతనాలు
- ప్రస్తుతం 7-14 తేదీలోపు విడతల వారీగా వేతనాలు
- నేడు దాదాపు 48 వేలమంది ఉద్యోగులు, పింఛనుదారులకు వేతనాలు
- ఇకపై ఏడాదిపాటు ఉద్యోగులకు దీర్ఘకాలిక సెలవులు
దసరా నేపథ్యంలో నేడే వేతనాలు అందనుండడంతో ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఇటీవల ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి కూడా ఉద్యోగులకు ప్రతినెల ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీలోని దాదాపు 48 వేల మంది ఉద్యోగులు, పెన్షనర్లు నేడు వేతనాలు అందుకోనున్నారు. కాగా, ఆర్టీసీ మరో నిర్ణయం కూడా తీసుకుంది. దీర్ఘకాలిక సెలవులపై ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది. ఇకపై డ్రైవర్లు, కండక్టర్లకు ఏడాదిపాటు దీర్ఘకాలిక సెలవులు మంజూరు చేస్తామని, అవసరమైనవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.