Mekapati Goutham Reddy: దేశంలోనే తొలిసారిగా ఏపీలో వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ విధానం: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

  • మంత్రి మేకపాటితో డబ్ల్యూఎఫ్ హెచ్ టీ కమిటీ సమావేశం
  • వర్చువల్ గా జరిగిన భేటీ
  • హాజరైన సజ్జల, ఉన్నతాధికారులు
  • అక్టోబరు 14న మరోసారి సమావేశం
Gautham Reddy explains WFHT

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ (డబ్ల్యూఎఫ్ హెచ్ టీ) కమిటీ వర్చువల్ గా సమావేశమైంది. ఈ సమావేశానికి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలోనే తొలిసారిగా ఏపీలో వర్క్ ఫ్రం హోం టౌన్ విధానం తీసుకువస్తున్నట్టు వెల్లడించారు.

వర్క్ ఫ్రం హోం టౌన్ వ్యవస్థల ఏర్పాటుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్టు వివరించారు. పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ డబ్ల్యూఎఫ్ హెచ్ టీల ఏర్పాటుకు నిర్ణయించినట్టు తెలిపారు. తొలుత 25 చోట్ల పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామని, క్షేత్రస్థాయిలో సమస్యలను లోతుగా అధ్యయనం చేస్తామని చెప్పారు. దీనిపై సజ్జల మాట్లాడుతూ, అక్టోబరు 14న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్టు తెలిపారు.

More Telugu News