SRH: సన్ రైజర్స్ స్కోరు 134-7... చెన్నై ముందు సింపుల్ టార్గెట్

Sunrisers Hyderabad set simple target to Chennai Super Kings
  • షార్జాలో చెన్నై వర్సెస్ హైదరాబాద్
  • మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్
  • 44 పరుగులు చేసిన సాహా
  • విఫలమైన జాసన్ రాయ్, విలియమ్సన్
  • హేజెల్ వుడ్ కు 3 వికెట్లు
చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు స్వల్ప స్కోరుతో సరిపెట్టుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులు చేసింది. ఇక్కడి షార్జా క్రికెట్ స్టేడియం బ్యాటింగ్ స్వర్గధామం అని పేరుంది. అయినప్పటికీ సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా చేసిన 44 పరుగులే అత్యధికం.

గత మ్యాచ్ లో రాణించిన ఓపెనర్ జాసన్ రాయ్ ఇవాళ 2 పరుగులు చేసి నిరాశపరిచాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (11) స్వల్ప స్కోరుకే వెనుదిరగడం జట్టు భారీ స్కోరు అవకాశాలను దెబ్బతీసింది. చెన్నై బౌలర్లలో హేజెల్ వుడ్ 3, బ్రావో 2, శార్దూల్ ఠాకూర్ 1, రవీంద్ర జడేజా 1 వికెట్ తీశారు.
SRH
CSK
Sharjah
IPL

More Telugu News