తీవ్రమైన తప్పులు చేసిన పోలీసులపై వేటు.. యూపీ సర్కారు ప్రకటన

30-09-2021 Thu 19:21
  • ఇటీవల పోలీసుల కస్టడీలో మరణించిన బిజినెస్‌మేన్
  • పోలీసుల క్రూరత్వంపై వెల్లువెత్తిన నిరసనలు
  • తప్పులు చేసిన వారికి పోలీసు శాఖలో స్థానం లేదన్న యోగి
Police officers involved in serious offences to be dismissed says UP CM

తీవ్రమైన తప్పులు చేసినట్లు ఆరోపణలున్న పోలీసు అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించారు. ఇటీవల పోలీసు కస్టడీలో ఒక వ్యాపారవేత్త మరణించిన సంగతి తెలిసిందే. ఈ మరణ వార్తతో యూపీలో పోలీసుల క్రూరత్వంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

దీంతో తప్పులు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులను డిస్మిస్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొందరు పోలీసు అధికారులు కొన్ని అనధికారిక పనులు చేస్తున్నట్లు రిపోర్టులు అందాయని, ఇలాంటి వ్యక్తులకు పోలీసు శాఖలో స్థానం లేదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఈ మేరకు యూపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇలాంటి కేసులతో సంబంధాలున్న పోలీసు అధికారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ప్రకటించింది.