సన్ రైజర్స్ పై టాస్ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్
- ఐపీఎల్ లో నేడు సన్ రైజర్స్ వర్సెస్ చెన్నై
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ధోనీ
- చెన్నై జట్టులో శామ్ కరన్ స్థానంలో బ్రావో
- అదే జట్టుతో బరిలో దిగుతున్న సన్ రైజర్స్
ఈ మ్యాచ్ ఫలితంతో హైదరాబాద్ జట్టుకు ఎలాంటి ఉపయోగం లేదు. ఇప్పటికే ఆ జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. చెన్నై జట్టు తన నెంబర్ వన్ పొజిషన్ ను మరింత పదిలపర్చుకోవడానికి ఈ మ్యాచ్ విజయం ఉపకరిస్తుంది. ఈ మ్యాచ్ కోసం సన్ రైజర్స్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు. చెన్నై జట్టులో శామ్ కరన్ స్థానంలో డ్వేన్ బ్రావో జట్టులోకి వచ్చాడు.