భయపెడతానంటున్నావ్.. ఇంకో 'జానీ' సినిమా చూపిస్తావా ఏంటి?: పవన్ పై కొడాలి నాని వ్యంగ్యం

30-09-2021 Thu 17:47
  • వైసీపీ నేతలకు భయం అంటే ఏంటో చూపిస్తానన్న పవన్
  • నువ్వా మమ్మల్ని భయపెట్టేది అంటూ నాని కౌంటర్
  • చంద్రబాబు స్క్రిప్టుల్ని చదువుతావంటూ వ్యాఖ్యలు
  • అన్ని పార్టీలతో కలిసి రా... చూసుకుందాం అంటూ సవాల్
Kodali Nani counters Pawan Kaltan statements

వైసీపీ నేతలకు భయం అంటే ఏంటో చూపిస్తానని జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. మమ్మల్ని భయపెడతానంటున్నావ్... 'జానీ' లాంటి సినిమా ఇంకోటి చూపిస్తావా ఏంటి? అంటూ ఎద్దేవా చేశారు.

చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టుల్ని చదివే నువ్వా మమ్మల్ని భయపెట్టేది? అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు బూట్లు నాకే వ్యక్తి పవన్ అని విమర్శించారు. పవన్ ను చూసి ఆయన అభిమానులు భయపడాల్సిందే తప్ప తాము కాదని స్పష్టం చేశారు.

"నువ్వు జీవితంలో వైసీపీని ఓడించలేవు... ముందు నువ్వు ఎమ్మెల్యేగా గెలుస్తావో, లేదో అది చూసుకో అని స్పష్టం చేశారు. అన్ని పార్టీలతో కలిసి రా... చూసుకుందాం" అని సవాల్ విసిరారు.