Posani Krishna Murali: పవన్ కల్యాణ్ నాపై దాడి చేయిస్తున్నాడు... చిరంజీవి ఎందుకు మాట్లాడటం లేదు?: పోసాని

Why Chiranjeevi is not responding questions Posani
  • ఒకానొకప్పుడు చిరంజీవి కుటుంబాన్ని నేను కాపాడాను
  • పవన్ ఊసరవెల్లి రాజకీయాల గురించి మాట్లాడితే దాడి చేస్తారా?
  • నాకు ఏమైనా జరిగితే పవన్ దే బాధ్యత
హైదరాబాద్ లోని యల్లారెడ్డిగూడలో ఉన్న పోసాని కృష్ణ మురళి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోసాని తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించారు. పవన్ కల్యాణ్ ఊసరవెల్లి రాజకీయాలపై మాట్లాడితే దాడి చేస్తారా? అని మండిపడ్డారు. డబ్బులిచ్చి మరీ తనపై పవన్ దాడి చేయిస్తున్నారని ఆరోపించారు.

ఒకానొకప్పుడు చిరంజీవి కుటుంబాన్ని తాను కాపాడానని... ఇప్పుడు ఆయన తమ్ముడు తనపై దాడులు చేయిస్తుంటే చిరంజీవి స్పందించరా? అని అడిగారు. తన ఇంటిపై జరిగిన దాడి గురించి చిరంజీవి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తన ప్రాణాలకు రక్షణ లేదని... తనపై వ్యక్తిగతంగా దాడి జరిగే అవకాశం ఉందని... తనకు ఏదైనా జరిగితే పవన్ కల్యాణ్ బాధ్యత వహించాలని అన్నారు.
Posani Krishna Murali
Pawan Kalyan
Janasena
Chiranjeevi
Tollywood

More Telugu News