Srinu Vaitla: శ్రియను ఇండస్ట్రీకి పరిచయం చేసే ఛాన్స్ అలా పోయింది: శ్రీను వైట్ల

Srinu Vaitla said about his first movie
  • 'ఆనందం' సినిమా చేసే ఛాన్స్ వచ్చింది
  • శ్రియను వెతికి పట్టుకున్నాను
  • అగ్రిమెంట్ కూడా పూర్తయింది
  • ఆ తరువాత మరో సినిమాకి షిఫ్ట్ అయింది
శ్రీను వైట్ల కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'ఆనందం' ఒకటిగా కనిపిస్తుంది. కథాకథనాల పరంగానే కాకుండా, పాటల పరంగా కూడా ఈ సినిమా ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా మొన్నటితో 20 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమాను గురించి శ్రీను వైట్ల మాట్లాడాడు.

"ఉషాకిరణ్ మూవీస్ వారు 'ఆనందం' సినిమాను చేసే ఛాన్స్ నాకు ఇచ్చారు. కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని భావించి అన్వేషణ మొదలుపెట్టాను. ఒక మేగజైన్ లో శ్రియ ఫొటోను చూసి, అతి కష్టం మీద ఆమె అడ్రెస్ సంపాదించాను. ఉషాకిరణ్ మూవీస్ వారు నా సినిమా కోసం ఆమెను తీసుకుని, అగ్రిమెంట్ కూడా చేశారు.

అయితే కొన్ని కారణాల వలన నా సినిమా ఆలస్యమైంది. దాంతో ఉషాకిరణ్ మూవీస్ వారు 'ఇష్టం' సినిమాను మొదలుపెట్టేసి, శ్రియను ఆ సినిమాకి షిఫ్ట్ చేశారు. అలా శ్రియను ఇండస్ట్రీకి పరిచయం చేసే ఛాన్స్ మిస్సయింది. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే, 'ఇష్టం' సినిమా కంటే రెండుమూడు నెలల ముందుగానే 'ఆనందం' విడుదలైంది" అని చెప్పుకొచ్చాడు.
Srinu Vaitla
Shriya
Anandam Movie

More Telugu News