Sai Dharam Tej: పవన్, దేవా కట్టా వ్యాఖ్యల నేపథ్యంలో.. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై నాగబాబు వివరణ

Nagababu gives clarity on Sai Dharam Tej Health condition
  • తేజ్ కోమాలో ఉన్నాడన్న పవన్ కల్యాణ్
  • ప్రీరిలీజ్ ఈవెంట్ ను తేజ్ చూశాడన్న దేవ కట్టా
  • తేజ్ ఆరోగ్యంగా ఉన్నాడన్న నాగబాబు
సినీ నటుడు సాయిధరమ్ తేజ్ ఈ నెల 10వ తేదీన రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన వెంటనే సాయితేజ్ కోమాలోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆయన హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, ఆయన ప్రస్తుత ఆరోగ్యానికి సంబంధించి అప్ డేట్స్ రావడం లేదు. తేజ్ ఆరోగ్యం ఎంతవరకు మెరుగు పడిందనే విషయంలో క్లారిటీ లేదు. మరోవైపు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతుండటం కూడా అందరినీ గందరగోళానికి గురి చేస్తోంది.

ఇటీవల జరిగిన 'రిపబ్లిక్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, తేజ్ కోమాలో ఉన్నాడని, అందుకే ఈవెంట్ కు తాను వచ్చానని చెప్పారు. మరోవైపు సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో దర్శకుడు దేవ కట్టా మాట్లాడుతూ... ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఆసుపత్రి నుంచి సాయితేజ్ చూశాడని తెలిపారు. ఆసుపత్రిలో తేజ్ ను కలిసిన తర్వాతే అక్టోబర్ 1న సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించామని చెప్పారు. కోమాలో ఉన్నాడని పవన్, ఈవెంట్ ను చూశాడని దేవ కట్టా చెరో విధంగా చెప్పడం గందరగోళానికి దారితీసింది.

ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు క్లారిటీ ఇచ్చారు. అభిమానులతో చిట్ చాట్ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, తేజ్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పారు. మీ ప్రార్థనలన్నీ ఫలించి తేజ్ క్షేమంగా బయటపడ్డాడని తెలిపారు. త్వరలోనే మన ముందుకు వస్తాడని చెప్పారు.
Sai Dharam Tej
Health
Tollywood
Pawan Kalyan
Janasena
Nagababu
Deva Katta

More Telugu News