KTR: కేటీఆరే భవిష్యత్ ప్రధాని.. జోస్యం చెప్పిన పీయూసీ చైర్మన్ జీవన్‌రెడ్డి

KTR Would be the Prime minister says PAC Chairman Jeevan Reddy
  • 20, 30 ఏళ్లలో కేటీఆర్ ప్రధాని అవుతారు
  • ప్రజల రక్తం తాగుతున్న జలగల పార్టీ బీజేపీ
  • బండి సంజయ్‌కు దమ్ముంటే ఢిల్లీకి పాదయాత్ర చేయాలి
దేశ భవిష్యత్ ప్రధాని కేటీఆరేనని రాష్ట్ర పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి జోస్యం చెప్పారు. మరో 20, 30 ఏళ్లలో కేటీఆర్ ప్రధాని కావడం పక్కా అని స్పష్టం చేశారు. నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన.. అసెంబ్లీలో కేటీఆర్ చేసిన ప్రసంగం అద్భుతమని కొనియాడారు. ఈ దెబ్బతో తమకు భవిష్యత్ లేదని కాంగ్రెస్, బీజేపీలు కలత చెందుతున్నాయన్నారు.

సీఎంకు లేఖలంటూ నాటకాలాడుతున్న బండి సంజయ్ దమ్ముంటే ప్రధానికి లేఖ రాయాలని సవాలు విసిరారు. సహచర ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి ఢిల్లీకి పాదయాత్ర చేయాలని అన్నారు. పన్నుల రూపంలో ప్రజల రక్తం తాగుతున్న బీజేపీ జలగల పార్టీ అని దుమ్మెత్తిపోశారు. రేవంత్‌రెడ్డిది నిరుద్యోగ సైరన్ కాదని, అది కలెక్షన్ సైరన్ అని, హుజూరాబాద్‌లో అభ్యర్థిని కూడా పెట్టుకోలేని దీన స్థితి ఆయనదని విమర్శించారు.
KTR
Telangana
TRS
PM
Bandi Sanjay
Revanth Reddy
Jeevan Reddy

More Telugu News