మమత వర్సెస్ బీజేపీ.. ప్రారంభమైన భవానీపూర్ ఉప ఎన్నిక పోలింగ్
- గత శాసనసభ ఎన్నికల్లో ఓడిన మమత
- భవానీపూర్‌లో గెలవడం మమతకు తప్పనిసరి
- పారామిలటరీ బలగాల మోహరింపు నడుమ ఎన్నికలు
పోలింగుకు ముందు బీజేపీ అభ్యర్థి ప్రియాంక మాట్లాడుతూ.. కేంద్ర పారా మిలిటరీ బలగాల బందోబస్తు నడుమ పోలింగ్ ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక భవానీపూర్‌లో మమత విజయం సాధిస్తే మరో ఐదేళ్లపాటు ఆమెకు సీఎంగా ఎదురుండదు. కానీ ఓడితే పరిస్థితి ఏంటన్న దానిపై రాజకీయ పరిశీలకులు ఇప్పటి నుంచే విశ్లేషణలు మొదలుపెట్టారు.