Madras High Court: తెలంగాణ గవర్నర్ తమిళిసైకి ఊరట.. పరువునష్టం కేసును కొట్టేసిన మద్రాస్ హైకోర్టు

Madras High Court quashes defamation case against Telangana Governor
  • తమిళనాడు బీజేపీ చీఫ్‌గా ఉన్న సమయంలో వీసీకే చీఫ్‌పై తీవ్ర వ్యాఖ్యలు
  • దాదాగిరి చేస్తున్నారంటూ మీడియాలో ఆరోపణలు
  • పరువునష్టం దావా వేసిన వీసీకే సభ్యుడు
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఆమెపై దాఖలైన పరువునష్టం కేసును ధర్మాసనం నిన్న కొట్టేసింది.  2017లో తమిళిసై తమిళనాడు బీజేపీ చీఫ్‌గా ఉన్నారు. ఓ సందర్భంలో వీసీకే చీఫ్ తిరుమవళవన్‌పై విరుచుకుపడ్డారు. ఆయన కట్టపంచాయత్తు (దాదాగిరి) చేస్తున్నారంటూ మీడియాలో ఆరోపించారు.

ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన వీసీకే సభ్యుడు తాలి కార్తికేయన్ కాంచీపురం కోర్టులో తమిళిసైపై పురువునష్టం దావా వేశారు. స్వీకరించిన కోర్టు విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు పంపింది. అయితే, సమన్లతోపాటు కేసును రద్దు చేయాలని కోరుతూ ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం.. వాక్ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్నప్పటికీ వాటికి పరిమితులు ఉన్నాయని గుర్తు చేస్తూ తమిళిసైపై నమోదైన కేసును కొట్టివేసింది.
Madras High Court
Defamation Suit
Telangana
Governor
Tamilisai Soundararajan

More Telugu News