Bihar: అదృష్టమంటే అతడిదే.. యాప్‌లో క్రికెట్ బెట్టింగ్ కాసి కోటీశ్వరుడైన క్షురకుడు!

Bihar barber wins Dream11 jackpot to become overnight millionaire
  • బీహార్‌లోని మధుబనికి చెందిన క్షౌరశాల నిర్వాహకుడిని వరించిన అదృష్టం
  • డ్రీమ్-11 యాప్‌లో బెట్ కట్టి రూ. కోటి సొంతం
  • వృత్తిని మానుకోబోనన్న అశోక్
అదృష్టం ఎప్పుడు, ఏవైపు నుంచి తన్నుకొస్తుందో ఎవరూ ఊహించలేరు. బీహార్‌లోని మధుబని జిల్లాకు చెందిన ఓ క్షౌరశాల నిర్వాహకుడు కూడా అలాగే అనుకున్నాడు. క్రికెట్ బెట్టింగ్ యాప్ అయిన ‘డ్రీమ్-11’లో అశోక్ బెట్టింగ్ కాస్తూ గత కొంతకాలంగా అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం అదృష్టం అతడి ఇంటి తలపు తట్టింది. కోటి రూపాయలు మోసుకొచ్చింది. అంత సొమ్ము గెలుచుకునే సరికి అతడి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

నానూర్ చౌక్ ప్రాంతంలో అశోక్ కుమార్ ఓ సెలూన్ నిర్వహిస్తున్నాడు. క్రికెట్ అంటే తొలి నుంచీ ఆసక్తి ఉన్న అతడు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ‘డ్రీమ్-11’లో బెట్టింగ్ కాయడాన్ని అలవాటుగా చేసుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌పై బెట్టింగ్ కట్టిన అశోక్ ఏకంగా కోటి రూపాయలు గెలుచుకున్నాడు.

విషయం తెలిసి అశోక్ ఆనందంలో మునిగి తేలుతున్నాడు. అయితే, కోటి రూపాయలు వచ్చినంతమాత్రాన వృత్తిని వదులుకోబోనని చెప్పుకొచ్చాడు. వచ్చిన సొమ్ముతో తొలుత అప్పులు తీర్చి, ఆపై ఇల్లు కట్టుకుంటానని చెప్పాడు.
Bihar
Dream 11
Jackpot
Barber

More Telugu News