Telangana: నిజామాబాద్‌లో దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారం

Ganga Rape in Nizamabad Telangana
  • యువతికి మద్యం తాగించి ఆపై అత్యాచారం
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు
  • పరారీలో నిందితులు
తెలంగాణలోని నిజామాబాద్‌లో దారుణం జరిగింది. ఓ యువతికి మద్యం తాగించిన నలుగురు యువకులు ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. కాగా, బాధితురాలు కోలుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.
Telangana
Nizamabad District
Gang Rape
Crime News

More Telugu News