Kommareddy Pattabhiram: వైసీపీ ఎమ్మెల్యే ఉదయభాను అనుచరులు బెదిరిస్తున్నారంటూ... డీజీపీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేత పట్టాభిరామ్

TDP leader Kommareddy Pattabhiram Complaints to DGP Over social media posts
  • జగ్గయ్యపేట వైసీపీ సంగతి తెలుసుకదా అని హెచ్చరికలు
  • పట్టాభిరామ్‌కు శ్రద్దాంజలి అంటూ  పోస్టులు
  • తనపైనా, తన కుటుంబంపైనా అసభ్యకర వ్యాఖ్యలు
  • చర్యలు తీసుకోవాలని డిమాండ్
సోషల్ మీడియా వేదికగా తనకు బెదిరింపులు వస్తున్నాయని, అంతుచూస్తామని బెదిరిస్తున్నారంటూ టీడీపీ నేత, ఆ  పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ నిన్న డీజీపీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి డీజీపీ కార్యాలయానికి వెళ్లిన పట్టాభిరామ్.. తనపై దుష్ప్రచారం చేస్తూ వేధిస్తున్నారని, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు క్షమాపణ చెప్పకపోతే అంతుచూస్తామని హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఉదయబాను రెండో కుమారుడు ప్రశాంత్ వ్యవహారశైలిపై మీడియా ముందు వాస్తవాలు తీసుకొచ్చినందుకే ఎమ్మెల్యే అనుచరులు తనను బెదిరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పట్టాభిరామ్‌కు శ్రద్ధాంజలి అంటూ పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, జగ్గయ్యపేట వైసీపీ సంగతి తెలుసుకదా అని హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. యర్రమాను రామకృష్ణ, జోన్స్ పణితి తదితరులు తనపైనా, తన కుటుంబ సభ్యులపైనా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని పట్టాభి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Kommareddy Pattabhiram
TDP
YSRCP
Andhra Pradesh
AP DGP

More Telugu News